చేనేత సంఘం పద్మశాలి లు నామినేషన్

July 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జులై 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం చేనేత సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా శాయంపేట మండల కేంద్రంలో చేనేత సహకార సంఘం లో తెలంగాణ.ప్రాంతీయ.పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 10.మందితో కూడిన నామినేషన్లు వేసినారు ముందుగా శాయంపేట గ్రామంలోని శ్రీ మత్స్యగిరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు దిడ్డి రమేష్ బాసాని ప్రకాష్ బాసాని నవీన్ మామిడి జగన్నాథం గడ్డం వెంకటేశ్వర్లు వంగర స్వరూపవలపదాసి స్వరూప వనం దేవరాజు బూర సురేష్ దిడ్డి ప్రభాకర్ నామినేషన్ వేశారు అనంతరం తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య మాట్లాడుతూ దిడ్డి రమేష్ ప్యానెల్ ను చేనేత కార్మిక సభ్యులు అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సంఘంలో పేరుకు పోయినటువంటి సమస్యలను ప్రభుత్వంతో మాట్లాడి సంఘాన్ని భవిష్యత్తులో లాభాల బాటలో నడిపిస్తారని నిత్యం కార్మికులకు అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు.గత 13 సంవత్సరాల కాలంలో సంఘ అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా చేనేత మిత్రులందరుమేల్కొని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం జిల్లా కార్యదర్శి దిడ్డి రమేష్ గ్రామ అధ్యక్షుడు బాసని ప్రకాష్ జిల్లా కార్యదర్శి పత్తి శీను చేనేత మాజీ చైర్మన్ బాసని రవి పిఎసిఎస్ చైర్మన్
కుసుమ శరత్ తుమ్మ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు……

🌐 Select Language:
📰 ePaper