ఘనంగా సుందరపు వెంకట సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు
జనం న్యూస్, జూలై 03,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఎస్‌టీబీఎల్‌లోని ఎమ్మెల్యే నివాసంలో జనసేన పార్టీ ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల కన్వీనర్ సుందరపు వెంకట సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమక్షంలో శ్రీ సుందరపు వెంకట సతీష్ కుమార్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సతీష్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ,ఆయురారోగ్యాల తో, సుఖసంతోషాలతో నిండి దీర్ఘాయుష్షుతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు సతీష్ కుమార్ కి పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేస్తున్న సేవలను కొనియాడుతూ,ఉత్తరాంధ్రలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు కార్యకర్తలు, అభిమానులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.