నేలరాలిన గీత కార్మికుడు

July 3, 2026 | తెలంగాణ

గీతా కార్మిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలి

తక్షణమే 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండి సదానందం గౌడ్ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు హాన్మకొండ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి లో ఈ రోజు ఉదయం (అందజా) 11 గంటలకు గీత కార్మికుడు పెరుమాండ్ల రాములు (34) తాటి చెట్టు మీద నుంచి పడి మరణించారు. ఇట్టి విషయాన్ని సొసైటీ అధ్యక్షుడు తండ కుమారస్వామి స్థానిక సర్పంచ్ చిర్ర అనిత రాజయ్య గార్ల ద్వారా తెలుసుకున్న కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆముదాలపెల్లి మల్లేశంగౌడ్ జిల్లా కమిటి సభ్యులు బండి సదానందం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో గల మార్చురి వద్దకు చేరుకొని మృతినికి ఘనంగా నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ సదానందం గౌడ్ గార్లు మాట్లాడుతూ రాములు కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 10లక్షల రూపాయలు ఎక్స్ గ్రెషియా ఇవ్వాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. మృతునికి భార్య, 6సంవత్సరాల కూతురు, 3సంవత్సరాల కుమారుడు ఉన్నారు చిన్నారులను చుసిన బందు మిత్రులు గ్రామస్థులు అందరు కన్నీళ్ల పర్వంతమైనరు పరామర్శించిన వారిలో పెండల చంద్ర మొగిలి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కోడెల సతీష్ బీసీ గ్రామ కమిటీ అధ్యక్షులు బీసీ సంఘ0 నాయకులు ఎదునూరి లింగన్న చిర్ర భద్రయ్య దొమ్మటి భద్రయ్య గోపరాజ్ లింగస్వామి రాసా రాజేష్ రాపర్తి శ్రీధర్ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper