నా స్థలంలో అక్రమంగా ఉన్న సి సి రోడ్డును పట్టించుకొని పంచాయతి రాజ్ శాఖ

జనం న్యూస్ 24 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పది రోజులు అవుతున్నా ముందుకు కదలని ప్రజావాణి దరఖాస్తు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల పరిధిలోని పచ్చర్ల గ్రామంలో ఇంటి యజమాని ప్రమేయం అనుమతి లేకుండా దౌర్జన్యంగా సి సి రోడ్డు వేశారు నా ఇంటి వెనకాల ఉన్న ఐదున్నర ఫీట్ల స్థలం లో అక్రమంగా కాంగ్రెస్ లీడర్ అయిన ప్రైవేట్ కాంట్రాక్టర్ దస్తగిరి మేము వద్దు అన్నా బలవంతంగా పోలీస్ స్టేషన్ నుంచి ఇంటి యజమాని అయిన నాకు ఫోన్ చేయించి బెదిరించాడు. అందుకు నేను బదులుగా మా స్థలం డాక్యుమెంట్లు పోలీస్ వారికి వాట్సప్ చేశాను. అయినా కూడా బలవంతంగా లోకల్ పాలిటిక్స్ పవర్ తో అట్టి స్థలంలో సి సి రోడ్డు వేశాడు. గత సర్పంచులకు ఇక్కడ సి సి రోడ్డు వేయకూడదు అని పలుమార్లు గ్రామ ప్రజా ప్రతి నిధులకు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ సి సి రోడ్డు వేసి కాలనీలోని వారికి మాకి గొడవలు సృష్టించారు. దీనితో స్థానికి పోలీస్ స్టేషన్ లో ఇట్టి విషయంలో పిర్యాదు కూడా చేయడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ రోడ్డు ఉందా లేదా అని నిర్ధారణ అయిన తర్వాత నే రోడ్డు మరమ్మత్తులకు గ్రామ పంచాయతి నుండి అనుమతులు (తీర్మానాలు రాయించుకోవాలి) మంజూరు చేయించుకోవాలి. కానీ నేను కాంగ్రెస్ లీడర్ అని, ప్రైవేట్ కాంట్రాక్టర్ దస్తగిరి ఇష్టం వచ్చినట్టు మా గ్రామంలో సి సి రోడ్లు వేశారు. మా స్థలం నుండి సి సి రోడ్డు ను తొలగించాలని గ్రామ సెక్రటరీ మండల యం పి ఓ అధికారి జిల్లా అధికారి డి పి ఓ కి అలాగే ప్రజావాణి లో కూడా పిర్యాదు చేశాము కానీ దాదాపు పది రోజులు అవుతున్నా ఎలాంటి స్పందన లేదు మండల జిల్లా అధికారులకు చేసిన పిర్యాదులను పాలిటిక్స్ పవర్ తో ప్రైవేట్ కాంట్రాక్టర్ దస్తగిరి అవుతున్నాడా అనే సందేశం కలుగుతుంది. పంచాయతి రాజ్ శాఖ ఉన్నత అధికారులు రాజోలి మండల ఎ ఇ పి ఆర్ అధికారి భరత్ కుమార్ ఎ విధంగా తీర్మానాలు రాయించాడు,కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన ప్రైవేట్ కాంట్రాక్టర్ దస్తగిరికి అనుకూలంగా అనుమతులు (తీర్మానాలు) ఉండేలా తీర్మానాలు రాయించాడ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి పంచాయతి రాజ్ శాఖ ఉన్నత అధికారులు ఎఇఇపిఅర్ భరత్ కుమార్, ప్రైవేట్ కాంట్రాక్టర్ దస్తగిరి పై చట్ట పరమైన చర్యలు తీసుకోని నా స్థలం లో వేసిన సి సి రోడ్డు ను తొలగించి నాకు న్యాయం చేయాలని అభ్యర్థన..