గాదె రామక్క కి ఘన నివాళులర్పించిన :-యల్లటూరు శివరామరాజు
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 23-06-26 కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం,నాగిరెడ్డిపల్లె పంచాయతీ పరిధిలో గాంధీ నగర్ గ్రామానికి చెందిన ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గాదె నరసయ్య తల్లి గాదె రామక్క అకాల మరణం చెందడం అత్యంత విషాద కరం.ఈ సందర్భంగా రాజంపేట జనసేన పార్టీ నాయకులు, మాజీ జెడ్పిటిసి సభ్యులు యల్లటూరు శివరామరాజు,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ మరియు ఇతర నాయకులు గాదె రామక్క పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.