నిర్లక్ష్య డ్రైవింగ్ కు నిండు ప్రాణం బలి

June 24, 2026 | తెలంగాణ

జనం న్యూస్: జూన్ 24 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్*నిడమనూరు మండలం బోక్కమంతలపాడు శివారులో తుమ్మడం రోడ్డు కోట మైసమ్మ గుడి వైపు వెళ్లే దారిలో త్రిపురారం మండలం కంప సాగర్ గ్రామానికి చెందిన నల్లబోతు సోమయ్య, తండ్రి సైదయ్య, వయసు: 65 అను వ్యక్తి తన బైకుపై కోట మైసమ్మ ఆలయం వైపు హైవే దాటుతుండగా వేగంగా వచ్చిన టిప్పర్ లారీ (ఏ పి 16 టి హెచ్ 2167 )తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సోమయ్య తలకు తీవ్రమైన గాయం తో ఆపస్మరక స్థితిలోకి వెళ్ళాడు. వెంటనే సోమయ్య సోదరుడు కృష్ణయ్య హుటాహుటిన సోమయ్యను మిర్యాలగూడ ఈ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా డాక్టర్లు మార్గం మధ్యలోనే సోమయ్య మృతి చెందాడని ధ్రువీకరించారు. ఇంతటి ఘోర ప్రమాదానికి కరమణమై, అతివేగంగా, అజాగ్రత్తగా టిప్పర్ వాహనాన్ని నడిపించిన దేశ గాని నవీన్ తండ్రి గురువయ్య, వయసు: 30, నివాసం: మాధవరం మునగాల, అను వ్యక్తిపై మృతుని సోదరుడు నల్లబోతు కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనదని నిడమనూరు ఎస్సై డి విజయ్ తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper