మాజీ కౌన్సిలర్ సి.హెచ్. సత్యనారాయణకు జనసేన నేతల ఘన నివాళులు

June 24, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి ప్రాంత మాజీ కౌన్సిలర్ సి.హెచ్. సత్యనారాయణ ఆకస్మిక మరణం పట్ల జనసేన పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యం కల్పించారు.ఈ సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, సమాచార సేకరణ కమిటీ పరిశీలకులు, చేరికల పర్యవేక్షణ కమిటీ సభ్యులు ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ సత్యనారాయణ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సత్యనారాయణ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన నాయకుడని, ఆయన మరణం స్థానిక ప్రజలకు, రాజకీయ వర్గాలకు తీరని లోటని పేర్కొన్నారు.అనంతరం సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రేమ్‌కుమార్, ఈ క్లిష్ట సమయంలో జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, మండలి అనిల్, మోతీనగర్ నాయకులు బడే విశ్వేశ్వరరావు, ప్రభు చైతన్య ఆరేటి, నల్లంపని రాజా, వలివేటి సురేష్, కాగితాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని సి.హెచ్. సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు.మాజీ కౌన్సిలర్ మరణవార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ, సామాజిక నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు తుదివీడ్కోలు పలికారు. సత్యనారాయణ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

🌐 Select Language:
📰 ePaper