జనప్రియ నగర్‌లో విజయ గణపతి–సీతారామాంజనేయ స్వామి త్రికూటాలయ ప్రారంభోత్సవం ఘనంగా

June 24, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బోరబండ: బోరబండ గాయత్రీ నగర్ పరిధిలోని జనప్రియ నగర్‌లో నూతనంగా నిర్మించిన విజయగణపతి–సీతా రామాంజనేయ స్వామి త్రికూటాలయం ప్రారంభోత్సవ వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించ బడ్డాయి. ఆలయ ప్రతిష్ఠా మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులను అభినందిస్తూ, ఈ ఆలయం ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో దేవాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. భక్తులందరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని కోరుతూ, భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను ధార్మిక మార్గంలో నడిపించాలని సూచించారు. ప్రారంభోత్సవ వేడుకల అనంతరం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఆలయ నిర్మాణానికి సహకరించిన వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, వేముల సత్యం, గాలి బాలాజీ, దినేష్ కుమార్, సుంకన్న, ఆదిరెడ్డి, మస్తాన్ రెడ్డి, రవి ముదిరాజ్ తదితర ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

🌐 Select Language:
📰 ePaper