నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు
జనం న్యూస్ ఆగస్టు 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి ఆల్విన్ కాలనీ ఫేజ్–2లో మిత్రులు బచ్చు శ్రీనివాస్ ఆహ్వానం మేరకు నిర్వహించిన నూతన గృహప్రవేశ వేడుకకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన గృహంలో కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం బచ్చు శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులను అభినందించి, నూతన గృహప్రవేశం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వారి ఆహ్వానాన్ని మన్నించి వేడుకలు పాల్గొన్నందుకు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని శ్రీనివాస్ శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు సిహెచ్ శ్రీనివాస్ గౌడ్, సంతోష్ గుప్త, దుర్గ ప్రసాద్ రావు,తదితరులు పాల్గొన్నారు.