ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఘనంగా ‘తెలుగు భాషా దినోత్సవం’
బిచ్కుంద ఆగస్టు 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) బిచ్కుంద లో తెలుగు విభాగం ఆధ్వర్యంలో ‘తెలుగు భాషా దినోత్సవం’ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కె. అశోక్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రసిద్ధ వ్యావహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… మసకబారిపోతున్న మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.అనంతరం తెలుగు విభాగం అధ్యాపకులు మాట్లాడుతూ… ప్రజల వ్యవహారిక భాషను బోధనాభాషగా, సాహిత్య భాషగా మార్చేందుకు గిడుగు రామ్మూర్తి పంతులు గారు చేసిన కృషిని, ఆయన సాగించిన ఉద్యమ ప్రస్థానాన్ని విద్యార్థులకు వివరించారు. తెలుగు భాషలోని గొప్పతనాన్ని, తీయదనాన్ని వివరిస్తూ విద్యార్థుల్లో భాషాభిమానాన్ని పెంపొందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. జి. వెంకటేశం, అకాడమిక్ కోఆర్డినేటర్ డా. టి. హన్మండ్లు, పీజీ కోఆర్డినేటర్ టి. సంతోష్, వివిధ విభాగాల అధ్యాపకులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు