ఎన్నికలకు జనసైనికులు సిద్ధంగా ఉండాలి నాదెండ్ల మనోహర్
జనం న్యూస్ ఆగస్టు 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మునగపాక గత స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీ చేసిన జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ చొప్ప శ్రీనును జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు సన్మానించారు. మంగళగిరిలో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశంలో యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా చొప్ప శ్రీనుకు ఘనంగా సన్మానం జరిగింది.ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు జనసైనికులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.చొప్ప శ్రీను మాట్లాడుతూ యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ తనను వెన్నుతట్టి ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మునగపాక మండలంలో జనసేన పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.//