తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలపై సమరభేరి – సన్నాహక సమావేశం

జుక్కల్ ఆగస్టు 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం, పెద్ద కొడపగల్ మండలంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు సమరభేరి సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.తెలంగాణ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, సెప్టెంబర్ 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమాలను విజయవంతం చేయడానికి BRS నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలి.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయడంలో విఫలమైందని జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే గారు అన్నారు.ప్రజలను నమ్మించి ఓట్లు తీసుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు.అందుకే సెప్టెంబర్ 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ప్రతి BRS నాయకుడు, ప్రతి కార్యకర్త చురుగ్గా పాల్గొనాలి. గ్రామగ్రామాన ప్రజలను కలుసుకుని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమిటి? వాటిలో ఎన్ని అమలు చేసింది? ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు ఏమిటి? అనే విషయాలను ప్రజలకు వివరించాలి.ఇది కేవలం BRS పార్టీ కార్యక్రమం మాత్రమే కాదు — ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రజా కార్యక్రమం.కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై ప్రజల ముందు ప్రశ్నలు ఉంచుదాం.ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిలదీద్దాం.ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం.సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలను విజయవంతం చేద్దాం.BRS నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం.