పచ్చదనం పెరిగితేనే పర్యావరణ పరిరక్షణ

June 8, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 08 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గ్రామసభలో అదనపు కలెక్టర్ మధు మోహన్ పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాల్సిన అవసరం ఉందని పచ్చదనం పెరిగితేనే ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చని అదనపు కలెక్టర్ మధు మోహన్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల షెడ్యూల్లో భాగంగా సోమవారం గద్వాల మండలం కాకులారం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో అదనపు కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే భూగర్భ జలాలను. కాపాడుకోగలుగు తామన్నారు. ప్రజలు తమ గృహ సంబంధ తడి, పొడి చెత్తను వేరువేరుగా చేయాలని సూచించారు. ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జయరాముడు ఉప సర్పంచ్ రజాక్ తహసిల్దార్ హరికృష్ణ పంచాయతీ కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జారీ చేయువారు: డీపీఆర్ఓ జోగులాంబ గద్వాల జిల్లా.

🌐 Select Language:
📰 ePaper