పరిగి పురపాలక సంఘంలో ముమ్మరంగా ఓటర్ల జాబితా సవరణ

August 28, 2026 | తెలంగాణ

పత్రాలు పరిశీలించి అక్కడికక్కడే ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి
హాజరైన బీఎల్ఓలు, మున్సిపల్ అధికారులు

జనం న్యూస్ ఆగస్టు 28 వికారాబాద్ జిల్లా పరిగి పురపాలక సంఘం పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితా సవరణలో భాగంగా మ్యాపింగ్ కాని వారికి సంబంధించిన ప్రత్యేక దరఖాస్తుల పరిశీలన శుక్రవారం ముమ్మరంగా సాగింది. పురపాలక సంఘ కమిషనర్ మల్లేష్, సహాయక ఓటర్ల నమోదు అధికారి (AERO) ల ఆధ్వర్యంలో స్థానిక పురపాలక కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితాలో ‘నో మ్యాపింగ్’ (No Mapping) లోపాలు ఉన్న ఓటర్లు, లబ్ధిదారులు తమ దరఖాస్తులు, సహాయక పత్రాలతో విచారణకు హాజరయ్యారు. అధికారులు ఆయా పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయి వివరాల ఆధారంగా అక్కడికక్కడే ఆన్‌లైన్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, స్థానిక వార్డు కౌన్సిలర్లతో పాటు బూత్ స్థాయి అధికారులు (BLOలు) మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొని సమన్వయం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లేష్ మాట్లాడుతూ… బీఎల్ఓల సహాయంతో అర్హులైన ప్రతి ఒక్క ఓటరుకు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా మ్యాపింగ్ సమస్యలు ఉన్నవారంతా తమ వివరాలను పురపాలక కార్యాలయంలో సరిచేసుకోవాలని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

🌐 Select Language:
📰 ePaper