పల్లంకుర్రు పి హెచ్ సి పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం* *”నిండు జీవితానికి రెండు చుక్కలు”
*జనం న్యూస్ జూన్ 29 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) *కాట్రేనికోన మండలం పల్లంకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిపల్లంకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ప్రతి సచివాలయంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతోంది. డాక్టర్ పి నీలిమ ,బి రోజా, ఈ కార్యక్రమం పరిరక్షణలోఈ పరిధిలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల మొత్తం *1893 మంది చిన్నారులకు* పోలియో చుక్కల మందు వేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం *మూడు రోజుల పాటు* నిర్వహిస్తున్నారు. *మొదటి రోజు*: కేటాయించిన కేంద్రాల వద్ద చిన్నారులకు చుక్కలు వేయడం *రెండవ రోజు*: ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయడం *మూడవ రోజు*: మిగిలిపోయిన పిల్లలందరికీ 100 శాతం చుక్కలు అందేలా ఇంటింటికి వెళ్లి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం*సిబ్బంది కృషి:* వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్యులు పి. నీలిమ, బి. రోజా పర్యవేక్షణలో, పర్యవేక్షకులు ఐ. వైడుర్యం, ఎం. క్రాంతి కుమార్, బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేశారు.*లక్ష్యం:* పోలియో రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా, ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా అందరికీ పోలియో రక్షణ కవచం అందించడం