బెల్లంపూడిలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం
జనంజనం న్యూస్ జూన్ 29 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధిగ్రంధి నానాజీ )డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్అంబేద్కర్ కోనసీమ జిల్లా : పి. గన్నవరం మండలంలోని బెల్లంపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తిక్క సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ చీకరమెల్లి శ్రీనివాసరావు, జిల్లా ఒబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వరరావు, జనసేన మండల నాయకుడు యర్రప్రగడ రవీంద్ర గోపాల్, టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ అనిశెట్టి శేషారావు, మాజీ సర్పంచ్ శ్రీమతి బండి మహాలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి కొప్పిశెట్టి వెంకటరత్నం, బిల్ కలెక్టర్ చీకరమెల్లి వెంకటేశ్వరరావు, ఏఎన్‌ఎమ్ శ్రీమతి పద్మజ, అంగన్‌వాడీ టీచర్ శ్రీమతి బండి వెంకటలక్ష్మి, ఆశా కార్యకర్తలు శ్రీమతి యన్నపు నాగమణి, శ్రీమతి జంగా బేబీ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, “పోలియో నిర్మూలనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో కీలకం. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారి ఆరోగ్య భవిష్యత్తును కాపాడేందుకు తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రభుత్వం చేపడుతున్న ప్రజారోగ్య కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయడానికి సహకరించాలి” అని పిలుపునిచ్చారు.