పశువులకు ముద్ద చర్మ వ్యాధికి నివారణకు టీకాలు వేయించాలి డాక్టర్ సునీల్

July 4, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జులై 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో పశువైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ నూనె దివ్య తిరుపతి అధ్యక్షతన లో నిర్వహించారు ఈ పశువైద్య శిబిరంలో పశువులకు ముద్ద చర్మ వ్యాధి నివారణకు టీకాలు పశువైద్యాధికారి డాక్టర్. సునీల్ వేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముద్ద చర్మ వ్యాధి తెల్లని పశువుల్లో ఎక్కువగా వ్యాపిస్తాయి అని అన్నారు ఇది అంటూ వ్యాధి అని వ్యాధి సోకిన శిశువుల్లో గుండ్రంగా పొక్కులు వస్తాయి వాటి నుండి చీము సోనలాగా కారి పుండ్లు ఏర్పడతాయి వాటి వల్ల పశువులకు విపరీతంగా జ్వరము వచ్చి పాల దిగుబడి ఉత్పత్తి వ్వవస్థదెబ్బతింటుందని ఆయన తెలిపారు వ్యాధి తీవ్రమైతే పశువులు చనిపోయే ప్రమాదం ఉందని అన్నారు అందువల్ల రైతులు తమ పశువులకు టీకాలు వేయించి పశువులను రక్షించుకోవాలని తెలియజేశారు అనంతరం మండలంలోని పెద్దకోడపాక గ్రామంలో పశువైద్య శిబిరం నిర్వహించారు వర్షాకాలంలో పశువులకు సీజనల్ గా వచ్చే వ్యాధుల నుండి పశువులను కాపాడుకోవాలి పశువులకు లంఫీస్కన్ ముద్ద చర్మ వ్యాధి సోకకుండా పశువైద్య శిబిరం నిర్వహించారు అని తెలిపారు ఇట్టి శిబిరంలో 108 తెల్లని పశువులకు లంఫీస్కన్ నిరోధక టీకాలు వేయడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంద దీనా ప్రభాకర్ రైతులు పశువైద్య సిబ్బంది విఎల్ఓ రమేష్ బాబు పశుమిత్ర రమాదేవి పాల్గొన్నారు….

🌐 Select Language:
📰 ePaper