పిడుగుపాటుకు ఆవు మృతి
: బోరున విలపించిన రైతు కుటుంబం
జనం న్యూస్ మే 19 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది ఆకస్మికంగా వాతావరణం మారి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు తీవ్రభయాందోళనకు గురయ్యారు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది రైతులు ఆరబెట్టిన ధాన్యం పంటలకు కూడా నష్టం వాటిలినట్లు సమాచారం మండలంలోని చండూరు గ్రామానికి చెందిన రైతు తలారి రమేష్ తండ్రి తలారి లచ్చయ్య కు చెందిన ఆవు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది సాయంత్రం సమయంలో మేత మేసేందుకు వెళ్లిన ఆవుపై ఒక్కసారిగా పిడుగు పడటంతో అది కుప్పకూలిపోయింది ఈ ఘటనను చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు అవే కుటుంబానికి ప్రధాన ఆధారమని పాల అమ్మకాల ద్వారా ద్వారానే జీవనం కొనసాగిస్తున్నామని బాధిత రైతు రమేష్ కన్నీరు మున్నేరుగా విలపించాడు ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబందిలో పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు సుమారుగా ఆవు 60 వేల వరకు ఉంటుందని రైతు తెలియజేశాడు వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వేడుకున్నాడు