గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలను భద్రపరిచే శీతలీకరణ ఫ్రిజ్‌లు పని చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి.

May 19, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 19 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చరిల్లు ఫ్రిడ్జ్ పనిచేయకపోవటం వారం రోజులుగా ఫ్రిజ్‌లు నిలిచిపోవడంతో మృతదేహాల సంరక్షణలో సమస్యలు తలెత్తుతున్నాయని సమాచారం జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాలను భద్రపరిచే శీతలీకరణ ఫ్రిజ్‌లు గత వారం రోజులుగా పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి.వారం రోజులుగా ఫ్రిజ్‌లు నిలిచిపోవడంతో మృతదేహాల సంరక్షణలో సమస్యలు తలెత్తుతున్నాయని సమాచారం.శీతలీకరణ వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ మరమ్మతులపై ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు స్పందించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్చురీలో దుర్వాసన వ్యాపిస్తోందని ఆసుపత్రికి వచ్చే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు దారితీస్తుంది..డాక్టర్లు మరియు సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం గత మూడు గంటల నుంచి గుర్తుతెలియని మృతదేహాన్ని మార్చురీ ముందు ఉంచడంపై పలు అనుమానాలకు తావిస్తుంది డాక్టర్ల నిర్లక్ష్య కారణమే ఇందుకు నిదర్శనం అని సోషల్ మీడియాకు తెలిపారు మృతదేహాల భద్రత విషయంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఆసుపత్రి నిర్వహణలో లోపాలు బయటపడటంతో జిల్లా వైద్యశాఖ స్పందించాలని కోరుతున్నారు.ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

🌐 Select Language:
📰 ePaper