‘పోలవరం మోదీ వరం’ సందర్శన యాత్రపోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి బిజెపి నేతల భారీ ర్యాలీ
జనం న్యూస్ జూలై 17 ముమ్మిడివరం ప్రతినిధి పోలవరం సందర్శన యాత్రలో బిజెపి ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా పదాధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి భారీ ర్యాలీగా బయలుదేరారు.పోలవరం జాతీయ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పాన్ని ప్రజలకు తెలియజేయడంతో పాటు, ప్రాజెక్టు పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించడం ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా కేంద్రం పూర్తి చేస్తోందని, ఇది రాష్ట్ర రైతుల కల అని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేసి ఆంధ్రప్రదేశ్ కు సాగు, తాగునీరు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ఈ యాత్రలో బిజెపి ముమ్మడివరం అసెంబ్లీ నాయకులు, జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ, ముమ్మడివరం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొల కోటి వెంకటరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు మట్టా సూరిబాబు, ఇళ్ల తాతారావు తో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.పోలవరం ప్రాజెక్టు పూర్తితో కోనసీమ రైతులకు సాగునీరు అందుతుందని, రాష్ట్ర అభివృద్ధికి ఇది మైలురాయి అవుతుందని నాయకులు ఆకాంక్షించారు.