ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం ఎమ్మెల్యే జీఎస్సార్

June 6, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరకాల డిపోకు చెందిన ఆర్.టి.సి బస్సును పరకాల నుండి సాధనపల్లి వయా మందారిపేట, శాయంపేట, ప్రగతి సింగారం,నూర్జహాన్ పల్లి,కాట్రపల్లి మీదుగా నడిచే కొత్త బస్సు సర్వీసును డిపో మేనేజర్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మందారి పేట, శాయంపేట, ప్రగతి సింగారం,నూర్జహాన్ పల్లి, కాట్రపల్లి,సాధనపల్లి గ్రామాల ప్రజలు చాలా కాలంగా బస్సు సౌకర్యం కోసం ఎదురుచూస్తున్నారని,వారి విజ్ఞప్తి మేరకు ఈ బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.ఈ బస్సు సర్వీసు ప్రారంభం ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు,వ్యాపారులు సాధారణ ప్రయాణికులకు రవాణా సౌకర్యం మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రోడ్లు,తాగునీరు, విద్యుత్‌తో పాటు రవాణా సదుపాయాలు కూడా కీలకమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ ఎంపీడీవో పాణి చంద్ర శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి (బుజ్జన్న) రవీందర్ కాంగ్రెస్ పార్టీ దుబాసి కృష్ణమూర్తి చల్ల చక్రపాణి పార్టీ నాయకులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper