ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి సిఐ సుధాకర్ రెడ్డి
జనం న్యూస్ మే22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సి ఐ సుధాకర్ రెడ్డి ప్రజలను కోరారు. గురువారం మండలంలోని పెద్దకోడేపాక గ్రామ సర్పంచ్ మంద దీనా గ్రామ పాలక వర్గం సహకారంతో రూ.25 వేల విలువైన నాలుగు సోలార్ సీసీ కెమెరాల కోసం సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై జక్కుల పరమేష్ సమక్షంలో సీసీ కెమెరాల డెమోన్స్ట్రేషన్ నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంద దీన ప్రభాకర్ ఉప సర్పంచ్ పైండ్ల సునీత చంద్రమౌళి వార్డ్ కోత్వాలు ప్రవళిక కిరణ్ మంద మౌనిక రత్నాకర్ రేణికుంట్ల శివ సుమన్ కోయిల శంకర్ వర్మ కోకిల అరుణ బిక్షపతి నాగేల్లి కిషోర్ మంద సదానందం గోడిశాల లలిత బక్కన్న రేణికుంట్ల స్వాతి పృధ్వీరాజ్ చంద రఘుపతి కుక్కల గణేష్ తదితరులు పాల్గొన్నారు…..