ప్రారంభమైన రాజగోపుర పూజలు..!- రేపు ప్రారంభోత్సవం.. ఏర్పాట్లు పూర్తి

July 4, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జులై 03. 07. 2026ఝరాసంగం/జహీరాబాద్ :ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహరాజ్ ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన రాజగోపుర ప్రారంభోత్సవ పూజలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.శుక్రవారం సాయంత్రం విఘ్నేశ్వర ఆరాధన, పుణ్యాహవచనం, ఋత్విక్ వరణం, మృత్తికా గ్రహణం, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, అంకురార్పణ, జలాధివాసం తదితర పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం 7:25 గంటలకు ప్రారంభమైన యాగశాల యజ్ఞం రాత్రి 9:10 గంటల వరకు కొనసాగింది.మూడు రోజులపాటు నిర్వహించనున్న రాజగోపుర ప్రారంభోత్సవాలు ఆశ్రమ పీఠాధిపతులు అవధూతగిరి మహరాజ్, సిద్ధేశ్వరానందగిరి మహరాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. రాజగోపుర నిర్మాణ దాత హైదరాబాద్‌ నిజాంపేట్‌కు చెందిన కోలన్ సునీత భద్రారెడ్డి యజ్ఞం, పూజలు నిర్వహించనున్నారు.భక్తులకు ఏర్పాట్లను ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ఆలయ పరిసరాలు మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చారణలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

🌐 Select Language:
📰 ePaper