బీబీపేట ఎస్ఐ నవీన్ చంద్రకు ఘన సన్మానం

July 31, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జూలై 31 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా బీబీపేట మండల ఆర్ టి ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో, ఆర్.టి.ఐ రాష్ట్ర డైరెక్టర్ ఎం.ఎ. సలీం, ఆదేశాల మేరకు, బీబీపేట ఎస్సైగా నూతన పదవీ బాధ్యతలు, స్వీకరించిన నవీన్ చంద్రను, మర్యాదపూర్వకంగా, శాలువా, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై, “నవీన్ చంద్ర” మాట్లాడుతూ, సమాచార హక్కు పరిరక్షణ బీబీపేట మండల ఆర్ టి ఐ కమిటీ, సన్మానించడం ఆనందంగా ఉందని, మండల కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా వారన్నారు. ఆర్ టి ఐ జిల్లా అడ్వైజర్, మండల అధ్యక్షులు, ఎం. నాంపల్లి, మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై దృష్టి సారించి, ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతి భద్రతలను, కాపాడాలని, ఎస్సై ని కోరారు. ఇట్టి సన్మాన కార్యక్రమంలో, ఆర్ టి ఐ జిల్లా అడ్వైజర్ మండల అధ్యక్షులు, నాంపల్లి,తో పాటు, కమిటీ సభ్యులు, ఆర్ స్వామి గౌడ్. పోలీసు సిబ్బంది. ఫయాజ్. స్వప్న. రచన నవీన్. లతోపాటు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper