బ్రహ్మకుమారీస్ సిద్ధిపేట సేవా కేంద్రంలో మన్మోహినీ దీదీ 43వ పుణ్యతిథి నిర్వహణ
జనం న్యూస్ : 30జూలై గురువారం: సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;బ్రహ్మకుమారీస్ సిద్ధిపేట సేవా కేంద్రంలో ఆదరణీయ మన్మోహినీ దీదీ 43వ పుణ్యతిథిని గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా మన్మోహినీ దీదీ అందించిన ఆధ్యాత్మిక సేవలను స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం రాజయోగ ధ్యానం నిర్వహించి విశ్వశాంతి, మానవాళి శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.వక్తలు మాట్లాడుతూ మన్మోహినీ దీదీ జీవితం ఆధ్యాత్మికత, సేవాభావం, విలువలతో కూడిన ఆదర్శప్రాయమైనదని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ సిద్ధిపేట సేవా కేంద్రానికి చెందిన సోదర సోదరీమణులు, ఆధ్యాత్మిక సాధకులు, భక్తులు పాల్గొన్నారు.