రాజాంలో భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తున్న ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు

July 30, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూలై 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచ్చేయనున్న నేపథ్యంలో, కార్యక్రమానికి పరిశీలకులుగా నియమితులైన ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు రాజాం నియోజకవర్గ జనసమీకరణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.రాజాం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రేగిడి, సంతకవిటి, వంగర, రాజాం రూరల్, రాజాం టౌన్ ప్రాంతాల పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ కార్యక్రమానికి భారీ స్థాయిలో జనసమీకరణ చేపట్టాలని సూచించారు. ప్రజలకు రవాణా తదితర సౌకర్యాలను ముందస్తుగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలకాలని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

🌐 Select Language:
📰 ePaper