మహానేత వైఎస్సార్ ఆశయ సాధనే మన లక్ష్యం: పొన్నాడ సతీష్ కుమార్

July 9, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూలై 8(ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైస్సార్సీపీ) కన్వీనర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ నేడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్ కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదని, పేదవాడి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ప్రజా హృదయ విజేత అని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్ వంటి చారిత్రాత్మక పథకాలు లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపాయని గుర్తుచేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా, ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు. మహానేత చూపిన బాటలో నడుస్తూ, ప్రజాక్షేమమే పరమావధిగా వైస్సార్సీపీ శ్రేణులన్నీ కలిసికట్టుగా పనిచేయాలని సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పితాని బాలకృష్ణ, కాశి బాలముని కుమారి, పెయ్యిల చిట్టీబాబు, కాశి రామకృష్ణ గ్రామ కమిటీ నాయకులు, పార్టీ అనుబంధ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper