మున్సిపాలిటీ స్థలంలో అడ్డగోలుగా ఏర్పాటు చేసిన వాటిని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ మరియు ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు – మున్సిపల్ అధికారుల సమక్షంలో మార్కింగ్

జనం న్యూస్ 07 మే 2029 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; మార్కింగ్ లోపలికి షాపులు ఉండాలి – మున్సిపల్ అండ్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపాలిటీలో అక్రమంగా నిర్మించిన వివిధ రకాల షాపులపై పోలీసులు మరియు మున్సిపల్ అధికారులు సంయుక్తంగా చర్యలు ప్రారంభించారు. గద్వాల పట్టణ కేంద్రంలో పలు ప్రాంతాలలో (కృష్ణవేణి చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ మరికొన్ని ప్రాంతాలలో) అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిపై మార్కింగ్ చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు గద్వాల మున్సిపల్ అధికారులు. ఈ చర్యలు ప్రజల భద్రత మరియు పట్టణ ప్రణాళికను కాపాడేందుకు చేపట్టినవని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిపై బుధవారం రోజు ట్రాఫిక్ పోలీసులు మరియు మున్సిపల్ అధికారుల సమక్షంలో ఎరుపు గుర్తులు వేసి హెచ్చరికలు జారీ చేశారు. అక్రమ నిర్మాణాల యజమానులకు ముందస్తు సమాచారం అందించారు. మున్సిపల్ చట్టాలను పాటించాలని, పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ఈ చర్యలు సాఫీగా కొనసాగుతున్నాయి. ప్రజలు చట్టాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే తొలగించబడే చర్యలు తప్పవని తెలిపారు. పట్టణ అభివృద్ధి దృష్ట్యా ఈ చర్యలు అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మరియు గద్వాల జిల్లా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ గద్వాల జిల్లా ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు మరియు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.