ఆధునిక పనిముట్లపై అవగాహన కార్యక్రమం

May 7, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ మే 7 చిలిపి చెడు మండల ప్రతినిధి ; మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం శీలం పల్లి రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులు కార్యక్రమంలో భాగంగా రైతులకు విద్యుత్ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలను వివరించడం జరిగింది .అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం కుసుం, పీఎం సూర్యఘర్ పథకాలను రైతులకు వివరించడం జరిగింది .అదేవిధంగా వ్యవసాయంలో సాంకేతిక మరియు ఆధునిక వ్యవసాయ పనిముట్లు వాడకం, వాటి సబ్సిడీ వివరాలు, డ్రోన్స్ ఉపయోగం వలన రైతులకు సమకూరే లాభాలు ఈ సమావేశంలో వివరించడం జరిగింది. ఈ సమావేశంలో ఎలక్ట్రిసిటీ ఏఈ రాకేష్ ఏవో రాజశేఖర్ గౌడ్ ఏఈఓ కృష్ణవేణి రైతులు విశ్వంబరు స్వామి , గోపాల్ రావు, సర్పంచులు సుధీర్ రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper