చేతిరాత శిక్షణ శిబిరంలో డ్రాయింగ్ పోటీల్లో” ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశoశ పత్రాలు

May 7, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ :7;ఏప్రిల్ గురువారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ; సిద్దిపేట పట్టణంలోని దీక్ష పరివార్ స్కూల్లో నిర్వహించిన డ్రాయింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలు ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీలలో మొదటి బహుమతి ను ఎన్. విక్రాంత్ సాధించగా, రెండో బహుమతి ను బి. శ్రీజ అందుకున్నారు. మిగతా పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా యెలిగేటి ఆర్ట్స్ అకాడమీ డ్రాయింగ్ టీచర్ వై. రమేష్ విజేతలకు సర్టిఫికెట్లు అందించి అభినందించారు. అలాగే శారదా కాలిగ్రఫీ అకాడమీకి చెందిన క్యాతం. అశోక్ విద్యార్థులకు హస్తలేఖనం ప్రాముఖ్యతను వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ:చిత్రలేఖనం అనేది కేవలం కళ మాత్రమే కాదు, మనసులోని భావాలను ప్రపంచానికి చెప్పే అద్భుత భాష.ప్రతి గీతలో సృజనాత్మకత, ప్రతి రంగులో ఒక భావం దాగి ఉంటుందని అదే నిజమైన కళని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు .

🌐 Select Language:
📰 ePaper