ప్రతి ఆడపిల్ల ఎంత కష్టం ఉన్న చదువును వదిలి పెట్టకూడదు జిల్లా కలెక్టర్

May 7, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ మే 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం గ్రామ శివారు ప్రాంతాల్లో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 10 వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఎ అక్షర ఎ చందన జె రమ్యశ్రీ వారిని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వారికి శాలువాతో సన్మానం చేసి వారికి కలెక్టర్ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం పత్రాన్ని అందజేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నేటి ప్రపంచంలో పోటీని తట్టుకుని సమాజంలో నిలబడాలంటే విద్యార్థులు చదువుల పైనే దృష్టి పెట్టి ఉన్నతమైన జీవితానికి బాటలు వేసుకోవాలని అన్నారు ప్రతి విద్యార్థులు పట్టుదలతో చదువుకోని ఉన్నత లక్ష్యాలను సాధించాలి ప్రతి ఆడపిల్ల ఎంత కష్టం ఉన్న చదువును వదిలి పెట్టకూడదు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు జీవితంలో స్థిరపడేలా నిర్ణయాలు తీసుకోవాలి అని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ గడ్డం బిక్షపతి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ప్రధానోఉపాధ్యాయురాలు ఎం మాధవి టీచర్లు సి ఎచ్ స్వర్ణలత శ్రావణి శైలజ తదితరులు పాల్గొన్నారు….

🌐 Select Language:
📰 ePaper