ముగిసిన శ్రీ మత్స్యగిరి స్వామి బ్రహ్మోత్సవాలు
జనం న్యూస్ మే 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతన శ్రీ మత్స్యగిరి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసాయి. ఆదివారం రాత్రి ఆలయంలో స్వామివారి నాగవల్లి కార్యక్రమాన్ని అత్యకులు కృష్ణమాచార్యులు వైభవంగా జరిపించారు. గత నెల 29 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. మచ్చర్లయ్య గుట్టకు భారీగా భక్తులు హాజరై స్వయంగా తెలిసిన స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కలు చెల్లించుకున్నారు. స్వామివారికి విశ్వక్సేనారాధన, స్వస్తి పుణ్యాహవచనం, ద్వాదశ ఆరాధనలు, పుష్పయాగాన్ని అర్చకులు జరిపించారు. శ్రీ మత్స్యగిరి స్వామి శ్రీదేవి భూదేవి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో అలంకరించి ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం దేవాలయ చైర్మెన్ సామల బిక్షపతి పండిత సన్మానం చేసి కల్యాణోత్సవాలు ముగిసినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్, జిన్నా ప్రతాప్ సేనారెడ్డి, గాన్ను వేణు దంపతులు కుసుమ వెంకటకృష్ణ, సామల రవీందర్, మహిళలు భక్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు….