రాజోలి మండల కేంద్రం పరిధిలో అక్రమ ఇసుక రవాణా తక్షణమే అడ్డుకోవాలని బి ఆర్ ఎస్ పార్టీ తరఫున రాజోలు గ్రామ ప్రజలు తరపున కోరడం జరిగింది

June 30, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 30 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు మండల బి ఆర్ ఎస్ పార్టీ తరఫున. రాజోలి మండల కేంద్రంలో రాజోలి గ్రామంలో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా పగలు రాత్రి అని తేడా లేకుండా యదేచ్చగా ఇసుక తోడైయడం వల్ల భూగర్భ జలాలు బోర్లు బావులు కూడా ఎండిపోతున్నాయికావున ఈ అక్రమ ఇసుక రవాణా వలన రోడ్లు మొత్తం పగిలిపోతున్నాయి రాత్రిపూట ఇండ్ల మధ్యలో వెళుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ అక్రమ ఇసుక రవాణాను పాల్పడుతున్న వారిపై శాఖ పరమైన తగు చర్యలు తీసుకోవాలని వీటి మీద ఒక ఉక్కు పాదం మోపాలని తెలపడం జరిగింది గౌరవ అలంపూర్ శాసన సభ్యులు విజయుడు కూడా ఈ దందాపై చర్యలు తీసుకోవాల్సిందిగా మైనింగ్ శాఖ రెవెన్యూ వారిని పోలీస్ శాఖ వారికి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది చర్యలు తీసుకొని ఎడల రాజోలి మండల బిఆర్ఎస్ పార్టీ గ్రామ ప్రజలుధర్నా రాస్తారోకో చేసి ఈ అక్రమ టిప్పర్లు ట్రాక్టర్లను అడ్డుకుంటామనితెలియజేశాం ఇసుక దందాపై పై బిఆర్ఎస్ కార్యకర్తలు మరియు రాజోలి గ్రామ ప్రజల తరఫున రాజోలి ఎమ్మార్వో కి మరియు ఎస్ఐ కి వినతిపత్రం అందజేయడంజరిగింది కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది

🌐 Select Language:
📰 ePaper