విద్యార్థుల్లో క్రమశిక్షణే లక్ష్యంగా బూట్లు, సాక్సుల పంపిణీ

September 5, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్, సెప్టెంబర్ 5: ఏర్గట్లలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు ప్రభుత్వం అందించిన బూట్లు, సాక్సులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి అందిన బూట్లు, సాక్సులను ఎలాంటి జాప్యం లేకుండా విద్యార్థులకు అందజేసినట్లు ఆయన తెలిపారు.విద్యార్థులు పాఠశాలకు యూనిఫాంతో పాటు బూట్లు, సాక్సులు ధరించి క్రమశిక్షణతో హాజరుకావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సదుపాయాన్ని కల్పిస్తోందని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. ప్రతిరోజూ బూట్లు ధరించి పాఠశాలకు రావాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.యూనిఫాం సక్రమంగా ధరించడం, బూట్లు వేసుకోవడం, సమయపాలన పాటించడం వంటి అలవాట్లు విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకుంటూ చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.బూట్లు, సాక్సుల పంపిణీ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మునీరుద్దీన్, ప్రసాద్, సమిత, విజయ్, రాజేందర్, రాజనర్సయ్య, గంగాధర్, సబిత, జ్యోతి, ట్వింకిల్ కుమార్, గంగా మోహన్, శ్యామల, రిషిక, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper