విద్యార్థుల హామీలను అమలు చేయాల్సిందే

September 5, 2026 | తెలంగాణ

పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారు


జనం న్యూస్ సెప్టెంబర్ 5, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోవిద్యార్ధి గర్జనలో ‘ విద్యార్థుల కోసం పాదయాత్రగా నడుచుకుంటూ నిరసనలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.ఎక్కడ……?*ఫీజు రియంబర్స్మెంట్…?* నిరుద్యోగ భృతి…?*విద్యార్థులకు స్కూటీలు…?* మెగా DSC …?*జాబ్ క్యాలెండర్…?*రెండు లక్షల ఉద్యోగాలు…?*BRS వర్కింగ్ ప్రెసిండెట్ KTR గారి పిలుపు మేరకు, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో,పరిగి పట్టణంలో కొడంగల్ చౌరస్తా నుంచి, అంబేత్కర్ విగ్రహం వరకు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.కాంగ్రెస్ పాలనలో గురుకులాల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది అని తెలిపారు.ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ నిరసిస్తూ విద్యార్థులతో కలిసి పాదయాత్ర గా నడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వనికి నిరసన తెలిపిన మహేష్ రెడ్డి.విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయక, పేద విద్యార్థులు చదువు ఆపేస్తు న్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ది తెచ్చుకొని, విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేయాలనీ, లేని పక్షంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున ధర్నాలో రాస్తారోకో నిర్వహిస్తాం అని ఎచ్చరించిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు బీ అర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper