సీఎం పర్యటన వేళ నందికొండలో బిఆర్ఎస్,బిజెపి నేతల ముందస్తు అరెస్ట్

September 5, 2026 | తెలంగాణ

అక్రమ అరెస్టులపై ప్రతిపక్షనేతల తీవ్ర ఆగ్రహం

జనం న్యూస్-సెప్టెంబర్ 6- నాగార్జునసాగర్ టౌన్- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నకిరేకల్ పర్యటన నేపథ్యంలో నందికొండ మునిసిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్ బిజెపి పార్టీల నేతలను పోలీసులు తెల్లవారుజాము నుంచి అరెస్టు చేసి స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు, ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలని ఆపలేరని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ జిల్లాలో ఏ మారుమూల ప్రాంతానికి వచ్చిన ప్రతిసారి ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయడమే పనిగా పెట్టుకున్నారని, ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతు నొక్కడం మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద పెట్టాలని అన్నారు,ఆప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు రోజులు దగ్గర పడ్డాయని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి1000 రోజులు అవుతున్న ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ప్రతిపక్షాలు నిలదీసి ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు, అరెస్ట్ అయిన వారిలో బిఆర్ఎస్ నాయకులు నకరికంటి సైదులు, ఉద్యమకారుడు హీరేకర్ రమేష్ జి, సపావత్ చంద్రమౌళి నాయక్, కోడా విజయ్, రమావత్ రాజేష్ నాయక్, బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా సీనియర్ నాయకులు కొమ్ము రాందాస్ లు ఉన్నారు.

🌐 Select Language:
📰 ePaper