ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి – గురువు విలువను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి
జనం న్యూస్ సెప్టెంబర్ 5: ముమ్మిడివరం ప్రతినిధి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి విద్యార్థికి గురువు విలువ తెలియాలని, గురువు అంటే దైవంతో సమానమని, మన తలరాతను మార్చేది గురువే, బ్రహ్మ తర్యాత గురువే అని ఆయన పేర్కొన్నారు. భారత మాజీ రాష్ట్రపతి, గొప్ప విద్యావేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, ఒక మంచి గురువు విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తారని తెలిపారు. డా. రాధాకృష్ణన్ చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజం మరింత ప్రగతి సాధిస్తుందని చెప్పారు. జ్ఞానాన్ని పంచుతూ భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమని కొనియాడుతూ ఉపాధ్యాయులందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.