అక్రమ రేషన్ బియ్యంపై పోలీసుల ఉక్కుపాదం 6 క్వింటాళ్లు స్వాధీనం
జనం న్యూస్ 05 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 6 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని మల్దకల్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఉలిగేపల్లి గ్రామానికి చెందిన యెరుకలి పరుశురాముడు (తండ్రి: అంజనేయులు)పై కేసు నమోదు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. రేషన్ లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించేందుకు పరుశురాముడు తన ఇంట్లోని బాత్రూమ్లో రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు తెలిపారు.శుక్రవారం ఉదయం 5:50 గంటల సమయంలో బ్లూకోల్ట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు తిప్పారెడ్డి (పి సి -1037), సుధాకర్ (పి సి -833) ఇంటిని తనిఖీ చేయగా 14 సంచుల్లో నిల్వ ఉంచిన 6 క్వింటాళ్ల రేషన్ బియ్యం గుర్తించారు. దీంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మల్దకల్ పోలీసులు తెలిపారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం నిల్వ చేయడం విక్రయించడం చట్టవిరుద్ధమని పోలీసులు హెచ్చరించారు