విద్య, వైద్య రంగాల బలోపేతమే ధ్యేయం.. అధికారుల తో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు సమీక్ష!

జుక్కల్ ఆగస్టు 2 8 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు (MEOs) మరియు వైద్యాధికారులతో (MOs) తో జుక్కల్ శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీకాంత రావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.విద్యాశాఖ తో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, పదో తరగతి ఫలితాల మెరుగుదల మరియు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు..వైద్యశాఖ అధికారులతో పీహెచ్సీల్లో సరిపడా మందుల లభ్యత, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, గర్భిణీలు-చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు..పేదలకు మెరుగైన విద్య, నాణ్యమైన వైద్యాన్ని అందించడమే మన ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.