శని త్రయోదశి జేష్ఠ అమావాస్య ప్రత్యేక పూజలు- చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ
జనం న్యూస్ మే 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణస్వయంభు భోగలింగేశ్వరునికి వైశాఖ మాస శివరాత్రి శుభ సందర్భంగా ప్రదోషకాల మహాన్యాస రుద్రాభిషేకము అతి వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పేరూరి చిన్ని స్వామి,సాత్విక్ శర్మ, అయ్యప్ప సాహిత్ మరియు ఏడిద నాగేంద్ర శర్మ.స్వామివారి రుద్రాభిషేకం అనంతరం ప్రత్యేకంగా సోమనాథ్ జ్యోతిర్లింగ అలంకరణలో దర్శనం ఇచ్చారు.. దేవాలయ చైర్మన్ కాoడ్రేగుల సత్యనారాయణ మరియు ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు.//