సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్

May 25, 2026 | తెలంగాణ

జనం న్యూస్ మే 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ సోమవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా బండి రమేష్‌ను నియమించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా బండి రమేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. తనపై విశ్వాసం ఉంచి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బండి రమేష్‌కు అభినందనలు తెలియజేస్తూ పలు సూచనలు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని కమ్మ సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు. కార్పొరేషన్‌కు వచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఆ పదవికి మరింత గౌరవం తీసుకురావాలని పేర్కొన్నారు. అదేవిధంగా, కార్పొరేషన్ ద్వారా సంఘంలోని పేదల అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ చైతన్యం పెంపు కోసం కృషి చేయాలని సూచించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యకర్తలు, కార్పొరేషన్ అనుబంధ సంఘాలు, సభ్యులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సీఎం సూచించినట్లు బండి రమేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన్ డిప్యూటీ చైర్మన్ పరుచూరి మురళి తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper