సిద్దిపేటలో చిన్నారికి ప్రశంసా పత్రం ప్రదానం
జనం న్యూస్ ; 26 మే మంగళవారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇంచార్జి వై.రమేష్ ;సిద్దిపేట పట్టణంలోని యెలిగేటి ఆర్ట్స్ అకాడమీ సిద్ధిపేట ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రాయింగ్ పోటీలో ఎన్ జీ ఓస్ కాలనీకి చెందిన చిన్నారి ఎం. విశ్వవిఖ్యాత్ డ్రాయింగ్ పోటీలో ప్రతిభ కనబరిచినందుకు ప్రశంస పత్రం మరియు బహుమతి అందజేయడం జరిగింది.చిన్నారుల్లో దాగి ఉన్న కళా ప్రతిభను వెలికితీసి వారికి ప్రోత్సాహం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా డైరెక్టర్ వై.రమేష్ పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు కళల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు చిన్నారిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు.కాగా, చిన్నారి విశ్వవిఖ్యాత్ తండ్రి డాక్టర్ ఎం. శ్రద్ధానందం డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రీజినల్ కోఆర్డినేటర్గా సేవలను అందిస్తున్నారు.