తెలంగాణ

పూడిమడక తీరంలో అల్లకల్లోలంగా సముద్రం

పూడిమడక తీరంలో అల్లకల్లోలంగా సముద్రం

సబ్ టైటిల్ : అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాలు

జనం న్యూస్, అక్టోబర్ 27,అచ్యుతాపురం : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నాబ్’ తీవ్ర తుఫాన్ ప్రభావంతో అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.తీరంలో భారీ కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో పాటు ఈదురుగాలులు వీస్తుండటంతో మత్స్యకారులు అప్రమత్తమయ్యారు.సముద్రంలో అలల ఉధృతి పెరగడంతో మత్స్య కారులు తమ పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. అయితే కొన్ని పడవలు అలల ఉధృతికి సముద్రంలోకి కొట్టుకుపోవడంతో వాటిని తిరిగి తీరానికి చేర్చేందుకు మత్స్యకారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పెద్ద పెద్ద తాళ్లు (రోప్‌లు) కట్టి పడవలను ఒడ్డుకు లాగేందుకు అష్టకష్టాలు పడ్డారు.తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారడం మత్స్యకారుల్లో ఆందోళన కలిగిస్తోంది. సముద్రంపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకార కుటుంబాలు ఉపాధి, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్థిక సహాయం అందించాలని మత్స్యకారులు కోరుతున్నారు.

ఇ-పేపర్