వైరల్ వార్తలు

శాయంపేట మండలంలో వరి పంటల క్షేత్ర పరిశీలన

శాయంపేట మండలంలో వరి పంటల క్షేత్ర పరిశీలన

జనం న్యూస్ అక్టోబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి పరకావసహాయ వ్యవసాయ సంచాలకులు ఎడిఎ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా, శాయంపేట మండలంలోని జోగంపల్లి, పెద్దకోడపాక, మైలారం కొప్పుల గ్రామాల్లో వరంగల్-44 వరంగల్ 44), సిద్ధిపేట వరి రకాల పంటలను సంబంధిత రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పంటల ప్రస్తుత స్థితిగతులను, పొలాల్లో పంట ఎదుగుదల పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాలతో సమగ్ర నివేదికను తయారు చేయడం జరిగింది.అనంతరం, పరిశీలన నివేదికను పరకాల సహాయ వ్యవసాయ సంచాలకులకు సమర్పించి, పంటల పరిస్థితిని శాస్త్రీయంగా విశ్లేషించి తదుపరి చర్యలు చేపట్టేందుకు సంబంధిత శాస్త్రవేత్తను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపవలసిందిగా కోరడం జరిగింది.

ఇ-పేపర్