జనం న్యూస్ అక్టోబర్ 31 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని సర్దార్ పటేల్ నగర్లో జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ చైర్మన్, నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజక వర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ని, ఎంపీ ఈటల రాజేందర్ ని మర్యాదపూర్వకంగా కలిసి జాతీయ ఐక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ, భారతదేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జరుపుకునే జాతీయ ఐక్యత దినోత్సవం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం అనేక సంస్థానాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి అఖండ భారతదేశ నిర్మాణంలో సర్దార్ పటేల్ పోషించిన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, యువభారత్ ప్రతినిధులు, కార్యకర్తలు పలు కాలేజీల విద్యార్థులు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.