జనం న్యూస్ అక్టోబర్ 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భారతదేశ రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసిన ధైర్యవంతమైన నాయకురాలు ఇందిరా గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ధూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు ఇందిరా గాంధీ 42వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో మండల నాయకులతో కలిసి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఐక్యత అభివృద్ధి కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు దేశంలో తొలి మహిళా ప్రధానమంత్రి గా ఎన్నుకోబడి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న ఘనత ఆమెకే దక్కుతుందన్నారు బ్యాంకులను జాతీయకరణ చేసి పేద వర్గాలకు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చిందం రవి కుసుమ శరత్ రఫీ డిటి రెడ్డి మారేపల్లి కట్టయ్య శంకరాచారి మారేపల్లి రాజు పత్తి శీను కొమ్ముల విష్ణు అరికెళ్ల సుధాకర్ యుగంధర్ కళ్యాణ్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు…..