కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ శేషాద్రిని రెడ్డి
జనం న్యూస్ అక్టోబర్ 31 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ ట్రాఫిక్ విభాగంలో విధుల నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు, ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడమే లక్ష్యంగా డీసీపీ ట్రాఫిక్-2 శేషాద్రిని రెడ్డి, ఐపీఎస్, కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, అధికారుల పనితీరు, స్టేషన్‌లోని రికార్డుల నిర్వహణ, ట్రాఫిక్ విధుల అమలు తీరు, సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా అధిగమిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రధాన రహదారులపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల రాకపోకలకు ఆటంకాలు లేకుండా చూడటం, విధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లో రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహిస్తూ, విధి నిర్వహణలో క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పనితీరుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ నిర్వహణలో నిరంతర పర్యవేక్షణ, సమర్థవంతమైన విధుల నిర్వహణతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.ఈ వార్షిక తనిఖీ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ట్రాఫిక్-2 వీరన్న, కూకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీ గిరి ప్రసాద్‌తో పాటు కూకట్పల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప. మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బందిలు పాల్గొన్నారు.