*:-పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి .*
జనం న్యూస్ నవంబర్ 2, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు సమన్వయముతో పని చేయాలి, అధికారం ఏ పార్టీకి, ఎవరికీ శాశ్వతం కాదు పరిగి నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ సర్పంచుల పైన, గ్రామ అభివృద్ధి నిధుల ఇవ్వడం పైన వివక్షత చూపడం మానుకోవాలి, ప్రజాసౌమ్యంలో ప్రజల చేతుల్లో ఎన్నుకోబడిన నాయకుడుగా ప్రజలకు న్యాయం చేసే బాధ్యత సర్పంచుల పైన ఉంటుంది. బిఆర్ఎస్ సర్పంచుల పైన వివక్షత చూపిస్తే భారీ ధర్నాకు దిగితా అని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, ఏచ్చారించిన మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పార్టీ అని చూడకుండా కాంగ్రెస్ సర్పంచులకు కూడా గ్రామ అభివృద్ధి నిధులు అందించానని తెలిపిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. తెలంగాణ ప్రజలు సమస్యలతో అల్లాడిపోతుంటే, ఢిల్లీకి, తెలంగాణ తిరగడానికే కాంగ్రెస్ నాయకులకు సరిపోతుంది.ప్రజల సమస్యల తీర్చకుండా, ప్రజలకు కొత్త సమస్యలు తేవడమేనా ప్రజా పాలనా? కరెంట్ లేదు, నీళ్లు లేవు తాగడానికి, పంటలు పండించడానికి, ఎలా బతకాలి మీకు ఓటు వేసిన ప్రజలు,ఇలాగే కాంగ్రెస్ పరిపాలన కొనసాగితే రానున్న రోజుల్లో బీఆరెస్ అధికారంలోకి రాగానే ఏం చేయాలో మాకు తెలుసు అని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంనికి ప్రజలు తగిన బుద్ది చెప్తారు అని మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమం లో మండల సర్పంచులు, బీఆరెస్ కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీ అరవింద్ రావు, బిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.