ఆంధ్రప్రదేశ్

బీబీపేట్ పి ఏ సి ఎస్ కు స్థలాన్ని కేటాయించిన యాడారం గ్రామ ప్రజలు

బీబీపేట్ పి ఏ సి ఎస్ కు స్థలాన్ని కేటాయించిన యాడారం గ్రామ ప్రజలు

జనం న్యూస్ నవంబర్ 4 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం గ్రామంలో కోనాపూర్ శివారులో గల 822 sy నెం లోని 7ఎకరాల 12 గుంటలను యాడారం గ్రామస్తులు గ్రామపంచాయతీ తీర్మానం ద్వారా బీబీపేట్ ప్రాథమిక సహకార సంఘానికి అందించారు. యాడారం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన ప్రభుత్వ స్థలాన్ని పి ఏ సి ఎస్ చైర్మన్ సుతారి రమేశ్, కి రైస్ మిల్లు గోదాం నిర్మించడానికి గ్రామం తరపున ఇస్తున్నామని తెలిపారు. ఇందుకు సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పి ఏ సి ఎస్ చైర్మన్ సుతారి రమేశ్ మాట్లాడుతూ అడగగానే స్థలాన్ని కేటాయించిన యాడారం గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలకు మండల రైతుల పక్షాన మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసారు. ఇట్టి కార్యక్రమంలో పి ఏ సి ఎస్ డైరెక్టర్లు పార్షగౌడ్, గోపాలరావు, మాజీ చైర్మెన్ ఇంద్రసేనారెడ్డి ఏ ఏం సి ఛైర్మెన్ పాత రాజు, బీబీపేట ఉపసర్పంచ్ ప్రశాంత్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమగౌడ్ సాయినాథ్, యాదారం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఇ-పేపర్