జనం న్యూస్ నవంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రాడ్యుయేట్ ల భవిష్యత్తు కోసం పట్ట భద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. ఈ మేరకు వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డికి మద్దతుగా మండలంలోని మందారిపేట గ్రామంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పట్టభద్రులను కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ, ప్రభుత్వ పథకాలను వివరించారు. అలాగే పట్టభద్రుల సమస్యలు, వారి ఆకాంక్షలను చట్టసభల్లో సర్వోత్తం రెడ్డి ప్రస్తావిస్తారని అన్నారు. అదేవిధంగా ఇంకా ఎవరైనా ఓటు నమోదు చేసుకోని పట్టభద్రులు వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారపెల్లి రవీందర్, చిందం రవి, నిమ్మల రమేష్, కుక్కల తిరుపతి, రావుల శ్రీనివాస్, కొమ్ముల భాస్కర్, పైడి, తక్కల్ల సాంబయ్య, కొమ్ముల విష్ణు, బడుగు అశోక్, తదితరులు పాల్గొన్నారు.